నాకున్న మూడున్నర ఎకరాల్లో వేరుశనగ వేద్దామని దుక్కిదున్నాను. కరెంట్ కోతలతో నీరు రెండు ఎకరాలకే సక్రమంగా పారించలేకపోతున్నా. మరో ఎకరా కూడా పెడితే ఎండిపోవడం ఖాయం. బోరులో నీళ్లున్నా కరెంట్ కోతల వల్ల ధైర్యం చేయలేకపోతున్నా. చాలా ఏళ్ల తర్వాత కరెంట్ కోతలు చూస్తున్నా. ప్రభుత్వం చొరవ తీసుకొని 18 గంటలు సరఫరా చేయాలి.
– కుమ్మరి లాలయ్య, రైతు, మార్చాల
ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు చేశాం. జిల్లాలో ప్రస్తుతం 11 గంటలు సింగిల్ ఫేజ్, 13 గంటలు త్రీఫేజ్ ఇస్తున్నాం. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగు విధానంలో రైతులు మార్పులు పాటించాలి. 13 గంటల విద్యుత్ సరఫరాతో ఎంత సేద్యం చేయొచ్చో ఆ మేరకే పంటల సాగు చేసుకోవాలి. ఈ సీజన్ ఇంతకంటే ఎక్కువ కరెంట్ ఆశించవద్దు.
– నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ


