ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు– మన్ననూర్– సిరిగిరిపాడు వరకు జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాముఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ రహదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారులను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదు. కొత్త రోడ్ల మంజూరు కోరుతూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్– నారాయణపేట– మక్తల్ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం.
– డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్


