ముసాయిదా ఓటరు జాబితా తదుపరి కార్యాచరణను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లాలో ఇప్పటివరకు 84 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. అనామలిస్ ఓటర్లకు నోటీసుల జారీ, విచారణకు సంబంధించి 18మంది మండలస్థాయి ట్రైనర్లు బీఎల్‌ఓలకు సమగ్ర అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా, అనర్హుల నమోదుకు అవకాశం లేకుండా నిబంధనల మేరకు సమగ్ర పరిశీలన జరపాలి. మ్యాపింగ్ వివరాలు సమర్పించని వారు, ఎన్యూమరేషన్ పత్రంలో ఒక భాగాన్ని మాత్రమే పూర్తి చేసిన వారు కూడా ముసాయిదా జాబితాలో ఉంటారు.
– హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్


