కల్వకుర్తి రూరల్: సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ కల్వకుర్తి బీఎస్‌ఎన్‌ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మ హాయాగం శుక్రవారం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ద్వాదశ సహస్ర మృతిక శివలింగాలకు వైభవోపేతంగా పంచామృతాభిషేకాలు నిర్వహించి.. మారే డు దళాలు, వివిధ పుష్పాలు, పసుపు, కుంకుమ, గంధం, భస్మంతో అలంకరించారు. పండితుల మంత్రోచ్ఛారణలు, రుద్ర, నమక, చమకాల ఘో షతో కల్వకుర్తి ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. విశేష చండీహోమం మహాలక్ష్మీ హోమం, విశేష లక్ష్మీ పాశుపత, సహిత అష్టలక్ష్మీ సరస్వతి హోమా లను నిర్వహించారు. సాయంత్రం కోటి కుంకుమ, పుష్పార్చనలు, శ్రీచక్ర విశేష అభిషేక అర్చనలు చేశారు. భక్తులు పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ భక్తిపారవశ్యంతో ఉ ప్పొంగారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి భక్తులకు ప్రవచనాలు చెప్పారు. బోలా శంకరుడి కరుణా కటాక్షాలు భక్తులపై ఉండాలని కాంక్షించారు. వివిధ పాఠశాలల నుంచి యాగశాలకు వచ్చిన విద్యార్థులు స్వా మీజీ బోధనలను ఆసక్తిగా వినడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయ ణం చేశారు. అనంతరం దాండియా, భక్తి పాటలకు నృత్యాలు చేశారు. దాదాపు 6వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.కార్యక్రమంలో జూ లూరు రమేశ్‌బాబు, బీచని బాలకృష్ణ, మాచిపెద్ది రా మస్వామి, పోలా సురేందర్, చిగుల్లపల్లి సతీష్, కల్మిచర్ల గోపాల్, గుబ్బ వెంకటేష్, మదన మురళి, పెద్దయ్యగౌడ్, జంగయ్య, అశోక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


