‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత

Aug 1 2026 1:01 AM | Updated on Aug 1 2026 1:01 AM

నాగర్‌కర్నూల్‌: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ హేమంత కేవశ్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, ఇన్‌చార్జి హౌసింగ్‌ పీడీ గోపాల్‌నాయక్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా అర్హుల తుది జాబితాలను సిద్ధం చేసి వెంటనే కలెక్టరేట్‌కు పంపించాలని సూచించారు. గుడిసెల్లో నివశిస్తున్న నిరుపేదలు, గృహ రహిత కుటుంబాలు, అత్యంత వెనకబడిన వర్గాలకు చెందినవారిని గుర్తించి.. రెండో విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీపీఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement