పోలింగ్ కేంద్రాలు
ఓటర్లు
ఒక కార్పొరేషన్, 18 పురపాలికల్లో ముసాయిదా..
● మొత్తం 60 డివిజన్లు.. 316 వార్డుల వారీగా వెల్లడి
● 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లే ప్రామాణికంగా రూపకల్పన
● బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శన
● 10న ఫైనల్ లిస్ట్.. ఆ తర్వాత ఎప్పడైనా ఎన్నికల షెడ్యూల్
798
6,19,423
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పుర పాలికల ఎన్నికలకు సంబంధించి తొలి కసరత్తు పూర్తయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు కార్పొరేషన్/మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పోలింగ్ సెంటర్లు ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ముసాయిదా ఓటరు లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఆయా బల్దియా, రెవెన్యూ, కలెక్టరేట్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో జాబితా ప్రతులను అతికించారు. ఈ నెల నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఐదో తేదీన ఆయా పురపాలికల్లో స్థానిక, ఆరున జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ నెల పదిన తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పురుషులు 3,04,294.. మహిళలు 3,15,094
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 6,19,423 మంది ఓటర్లు ఉన్నట్లు పురపాలికల అధికారులు ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఇందులో పురుషులు 3,04,294, మహిళలు 3,15,094 కాగా.. ఇతరులు 35 మంది ఉన్నారు. అన్ని పురపాలికల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో కలుపుకుని మొత్తం 21 పురపాలికలు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, మిగతా 18 మున్సిపాలిటీల్లో 316 వార్డులు ఉండగా.. మొత్తంగా 798 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేశారు.
60 డివిజన్లు, 316 వార్డులు.. 798 పీఎస్‌లు
పోలింగ్ కేంద్రాలు
పోలింగ్ కేంద్రాలు


