సెర్ప్‌లో బదిలీలు!
అచ్చంపేట: సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారికి అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్రత్యేకంగా జీఓ జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసి.. త్వరలోనే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది. దీంతో ఏడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాలో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏడేళ్లుగా ఎదురుచూపులు..
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ వంటి రెండు విభాగాల్లో జిల్లావ్యాప్తంగా 134 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపీఓ పోస్టులకు జోనల్ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లా స్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీఓ, ఈసీలు, టీసీ, డీఆర్సీ, డీడీసీఎల్‌ఆర్‌సీ, డీబీటీ మేనేజర్, ప్లానింగ్ సూపర్‌వైజర్ పోస్టులకు జోనల్ స్థాయిలో.. టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు జిల్లా స్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే అయా విభాగాల్లో ఏడేళ్లుగా బదిలీల ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఆఫీస్ అసిస్టెంట్లు: 3
ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తికి కసరత్తు
త్వరలోనే విధి విధానాలు ఖరారు
జిల్లాలో 134 మంది ఉద్యోగులు
నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం..
సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ జారీ చేసింది. త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటించనుంది. వాటి ఆధారంగా నెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ.. వారిని కూడా బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపడుతాం.
– ఓబులేష్, డీఆర్డీఓ
సెర్ప్‌లో బదిలీలు!


