రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం

Mar 9 2025 12:35 AM | Updated on Mar 9 2025 12:35 AM

రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం

రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం

నాగర్‌కర్నూల్‌ క్రైం: కక్షిదారులు ఎవరైనా రాజీమార్గం ద్వారా కేసులు సులభంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కక్షిదారులకు ఒక మంచి అవకాశం అని, ఏళ్లతరబడిగా కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో శనివారం జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 33,582 కేసులు పరిష్కరించామని, రూ.66,18,763 నగదు వసూలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సబిత, సెకండ్‌ అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు.

కల్వకుర్తి టౌన్‌: కక్షిదారుల రాజీమార్గంతోనే చాలా కేసులు పరిష్కారమవుతాయని కల్వకుర్తి సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి శ్రీదేవి అన్నారు. శనివారం కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో కల్వకుర్తి కోర్టు పరిధిలో 189 కేసులలో కక్షిదారులు రాజీపడ్డారన్నారు. సీనియర్‌ సివిల్‌ కోర్టులో రెండు ఓఎస్‌ కేసులు పరిష్కారం కాగా, మార్నింగ్‌ కోర్టులో 84 అడ్మిషన్‌ కేసులు పరిష్కారం కాగా, వాటికి సంబంధించి రూ.43,800 జరిమానాలు విధించారు. జూనియర్‌ సివిల్‌ కోర్టులో 103 కేసులకు పరిష్కారం లభించగా వాటిలో అడ్మిషన్‌ కేసులు 81 పరిష్కారమవ్వగా, రూ.2.3 లక్షల జరిమానా విధించారు. 21 లోక్‌ అదాలత్‌ కేసులలో రాజీకుదరగా, ఒక సివిల్‌ కేసులో కక్షిదారులు పరిష్కారమయ్యారని జడ్జిలు చెప్పారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కావ్య, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, కోర్టు పరిధిలోని పోలీసులు, కక్షిదారులు పాల్గొన్నారు.

టెండర్ల ఆహ్వానం

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయానికి కావాల్సిన ఫర్నిచర్‌తోపాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు సంబంధించి ఆసక్తి ఉన్నవారు టెండర్‌ వేయవచ్చని జిల్లా జడ్జి రాజేష్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ నెల 12 వరకు సీల్డ్‌ కవర్‌లో కొటేషన్‌ వే యాలన్నారు. రెండు కంప్యూటర్లతోపాటు మూ డు ప్రింటర్లు, ఒక వెబ్‌ కెమెరా, నాలుగు ఆఫీస్‌ టేబుళ్లు, రెండు అల్మారాలు, ఒక ఎయిర్‌ కూల ర్‌, వాటర్‌ డిస్పెన్సర్‌కు టెండర్‌ వేయాలన్నారు.

పెండింగ్‌ బిల్లులు

విడుదల చేయాలి

నాగర్‌కర్నూల్‌: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ మేరకు వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి అన్నారు. సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రథమ కార్యవర్గ సమావేశానికి సంఘం మురళి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రావు సంఘ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం పర్వత్‌రెడ్డి మాట్లాడుతూ బకాయి డీఏలను ప్రకటించి, పీఆర్సీ నివేదిక తెప్పించాలన్నారు. అలాగే 2008 డీఎస్సీలో ఎంపికై ఇటీవల ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఉపాధ్యాయులను సంఘంలోకి ఆహ్వానించి సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు హన్మంతురెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీష్‌, అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మారావు, రమేశ్‌, కన్వీనర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌, రఘు రాంరెడ్డి, జమీల్‌ అహ్మద్‌, వరప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డి, బాల స్వామి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement