నాగర్‌కర్నూల్ క్రైం: మహిళల రక్షణ కోసం షీటీం నిరంతరం పనిచేస్తుందని ఏఎస్పీ రామేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో షీటీం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేసిన పోకిరీలను గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. గత నెలలో మొత్తం 16 ఫిర్యాదులు రాగా.. అందులో 6 కేసులు నమోదు చేయడంతోపాటు 10 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, 20 అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎవరైనా వేధింపులకు గురైతే డయల్ 100, సెల్ నం.87126 57676ను సంప్రదించాలని సూచించారు.


