కాళేశ్వరం అష్టతీర్థాలకు టెండర్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం అష్టతీర్థాలకు టెండర్లు పూర్తి

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.60కోట్లతో అష్టతీర్థాఽల ఘాట్ల నిర్మాణానికి ఇరిగేషన్‌శాఖ ద్వారా టెండర్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన సరళ ప్రాజెక్ట్‌స్‌ దక్కించుకున్నట్లు తెలిసింది.

జాతీయస్థాయికి

సాత్విక శ్రీని ఎంపిక

చిట్యాల: మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో సెకండియర్‌ చదువుతున్న మద్దెల సాత్విక శ్రీని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ గొల్గొండ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12, 13 తేదీలలో సంగారెడ్డి జిల్లాలో హెచ్‌జీఎఫ్‌ రాష్ట్ర మీట్‌లో జరిగిన అండర్‌ 19 జూనియర్‌ కళాశాల కబడ్డీ చాంపియన్‌ షిఫ్‌ రాష్ట్రస్థాయి పోటీలకు వరంగల్‌ జట్టుకు కెప్టెన్‌గా వవహరించారని అన్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సి పాల్‌ భిక్షపతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.మాలాతిలత, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం.వెన్నెల, పీఈటీ కె.శారద, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement