‘ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రావొద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రావొద్దు’

Oct 24 2026 9:14 AM | Updated on Oct 24 2026 9:14 AM

వాజేడు: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి అక్రమంగా ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌ జీ అన్నారు. మండలపరిధిలోని చెరుకూరు గ్రామం వద్ద 163 నంబర్‌ జా తీయ రహదారిపై అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. పక్క రాష్ట్రం నుంచి రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా నివారించడానికి సంబంధిత అధికారులు 24 గంటలు విధులను నిర్వహించాలని సూచించారు. చెక్‌ పోస్టు వద్ద ఉండే సిబ్బందికి పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ కృష్ణవేణి, సివిల్‌ సప్లయీస్‌ అధికారి ఫైజల్‌ హుస్సేన్‌, డీటీ రామ్‌సింగ్‌, ఆర్‌ఐ కుమారస్వామి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement