ఏటూరునాగారం: మండలంలోని శంకరాజుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ధనసరి అనసూయ సీతక్క సహకారంతో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం శంకరాజుపల్లి గ్రామంలోని 6వ వార్డు సభ్యురాలు తాటి శ్రీలతనీలాద్రి సమక్షంలో కేకేగూడెం కాలనీలో డ్రెయినేజీ పనులు ప్రారంభించారు. డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపడడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తగ్గి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.2.45 కోట్ల నిధులతో గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
వీబీజీ రామ్‌జీ పనుల పరిశీలన
వెంకటాపురం(ఎం): మండలంలోని రామానుజపూర్ గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపడుతున్న ట్రెంచ్ పనులను జిల్లా జలసిరి ప్రత్యేక అధికారి రాజారావు శుక్రవారం పరిశీ లించారు. కూలీలు ప్రతిరోజూ రూ.308 వేత నం పొందేలా పని చేయాలన్నారు. పని ప్రదేశంలో కూలీలకు తాగునీటి సదుపాయం క ల్పించాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఉపాధి హామీ పనులకు కనీసం 100 మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రవీందర్, ఏపీడీ వెంకటనారాయణ, ఏపీఓ రాజు, ఈసీ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సురేష్ కుమార్, రాజేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్య, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు: జిల్లాలో ఆయూష్ విభాగంలో జాతీ య ఆయూష్ మిషన్ కింద పొరుగు సేవల ప్రాతిపదికన 7 పోస్టులను భర్తీ చేసేందుకు ద రఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎంపిక కమి టీ నోడల్ అధికారి సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయూష్ వైద్యాధి కారులు 3, ఫార్మసిస్ట్, యోగా ప్రొఫేషనల్, సైకోసో షియల్ కౌన్సిలర్ ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు 2026 జులై 1 నాటికి 44 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్టు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9908431655 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
గణపేశ్వరాలయంలో
ప్రత్యేక పూజలు
గణపురం: శుక్రవారం సందర్భంగా మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అ ర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున స్వా మి వారిని దర్శించుకున్నారు.
నేడు కాళేశ్వరానికి
దేవాదాయ శాఖ కమిషనర్
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం రానున్నారు. దేవస్థానం పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం వచ్చే ఏడాది కాళేశ్వరంలో జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల ఏర్పాట్లపై ఈ సందర్భంగా ఈఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ మహేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్లు, దేవస్థాన అభివృద్ధి పనుల పురోగతిపై చర్చిస్తారని ఈఓ పేర్కొన్నారు.


