న్యూస్‌రీల్
శనివారం శ్రీ 26 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● మూడు నెలల ఇంటింటి సర్వేలో వెల్లడి
● జూలైలో మొదలైన సర్వే
● జిల్లాలో 15 పీహెచ్‌సీలు, 89 సబ్ సెంటర్లు
ప్రతీ తల్లిదండ్రికి తమ కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచిన కూతురు ఉన్నతస్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి మురిసిపోవడంలో ఉన్న ఆనందం మరెక్కడా ఉండదు. కూతురితో గడిపిన ప్రతీ విషయం ఓ తీపిజ్ఞాపకం. మీకూ అలాంటి తీపి జ్ఞాపకాలు, మీ కూతురు గొప్పతనం గురించి డాటర్స్ డే (కూతురు దినోత్సవం) సందర్భంగా ‘సాక్షి’తో పంచుకోండి. దీంతోపాటు తల్లిదండ్రి తమ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో, మీ పేరు, ప్రాంతం వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 27వ తేదీ పత్రికలో ప్రచురిస్తాం.
జిల్లాలో 7,348 మంది జ్వర పీడితులు
ఏటూరునాగారం: వాతావరణంలో వచ్చే మార్పులు, ఇంటి పరిసరాలు, గ్రామాల అపరిశుభ్రతతో రోగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో జూలై నెలలో ఇంటింటి సర్వే చేపట్టారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేసిన ఈ సర్వేలో 7,348 మంది జ్వర పీడితులను గుర్తించి వారికి చికిత్సలు అందించారు. అయితే ఎల్‌నినో ప్రభావంతో వర్షం, ఎండలు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. దీంతో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జ్వరాలను అదుపులోకి తీసుకురావడానికి ఇంటింటా సర్వేలను చేపట్టారు. ప్రతీవారంలో మంగళవారం, శుక్రవారం సర్వేలు చేయగా వాటిలో అనేకమంది జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు మొదలు కావడంతో అధికారులు సర్వేను మరింత వేగవంతం చేశారు. వాతావరణం మార్పులతో అనేకమంది జ్వరం బారిన పడుతున్నారు.
15 పీహెచ్‌సీల పరిధిలో..
జిల్లాలో పది మండలాల్లోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 సబ్‌సెంటర్లు ఉన్నాయి. జూలై నెలలో 21,359 ఇళ్లను సందర్శించి 175 జ్వర పీడితులు, ఆర్‌డీటీ 98 పరీక్షలు, డెంగీ అనుమానం ఉన్న ఐదుగురికి పరీక్షలు చేపట్టారు. 46 మందికి రక్తపూతలను సేకరించారు. ఒక టైఫాయిడ్, 46 మందికి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. యాంటీ లార్వా కేసులను 925 మంది ఇళ్లలో ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు.
ఆగస్టు నెలలో..
1,52,214 ఇళ్లను సర్వే చేయగా 4,144 మంది జ్వర పీడితులను గుర్తించారు. 241 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 9,184 మందికి రక్త పరీక్షలు చేశారు. అందులో 557 మందికి జ్వరం, 206 మందికి డయేరియా, 273 మందికి శ్వాసకోశ వ్యాధులు, ఇద్దరికి మలేరియా ఉందని ఈ పరీక్షల్లో తేలింది. యాంటీ లార్వా కేసులు 782 ఉండగా వాటిని గుర్తించి తొలగించారు.
సెప్టెంబర్‌లో ఇలా..
1,79,32 ఇళ్లను సర్వే చేయగా 3,029 మంది జ్వర బాధితులను గుర్తించారు. 3,029 మందికి ఆర్‌డీటీ పరీక్షలు చేయగా ఇందులో 8 డెంగీ, 91 డయేరియా కేసులున్నాయి. 40 మందికి శ్వాసకోశ వ్యాధి ఉ న్నట్లు సర్వేలో తేలింది. యాంటి లార్వా కేసులు 226 గుర్తించి తొలగించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
ప్రతీ వ్యక్తి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే ఆస్పత్రి, వైద్య సిబ్బందిని సంప్రదించాలి. ఏమవుతుందని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వచ్చే అవకావాలున్నాయి. జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బంది, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను సందర్శించి అక్కడ ఉచిత వైద్య సదుపాయాలు పొందాలి. ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు. వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
–డాక్టర్ నాగరాజు,
బ్రహ్మణపల్లి పీహెచ్‌సీ, మంగపేట
కాటాపురంలో సర్వే చేస్తున్న వైద్యులు, సిబ్బంది
మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 95500 66739


