ఏజెన్సీలో ముసురు | - | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ముసురు

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

● మూడు రోజులుగా కురుస్తున్న వర్షం

● పొంగిపొర్లుతున్న వాగులు

● ఏజెన్సీ గ్రామాలకు నిలిసిన రాకపోకలు

● మిర్చితోటల్లోకి చేరిన నీరు

ఏటూరునాగారం/కన్నాయిగూడెం/వాజేడు: ఎడ తెరిపి లేకుండా మూడు రోజులుగా కురుస్తున్న వ ర్షంతో జిల్లాలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం మండలం కొండా యి వద్ద బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతుండడంతో తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. కొంతమంది బ్రిడ్జిపై స్లాబ్‌లు పడడంతో కాలినడకన దాటుతున్నారు. ఎలిశెట్టిపల్లిలో కూ డా వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరా యం ఏర్పడుతుంది. మరోవైపు అటవీ ప్రాంతాల నుంచి వచ్చే అడవిమార్గం రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. అలాగే కన్నాయిగూడెం మండలంలోని ఐలాపుర్‌, సర్వాయితో పాటు మరికొన్ని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దయ్యాలవాగు, బుట్టాయిగూడెంలోని ఏడు వాగు ల కలయికతో అనుమంతుని వాగు, మల్కపల్లి వా గులు పొంగిపొర్లుతున్నాయి. ఐలాపుర్‌లోని కొర్లవాగు, దయ్యావాగులు పొంగిపొర్లుతుండడంతో ఆ యా గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే మిర్చి, వరి తదితర పంటలు వరద నీటిలో మునిగిపోయాయి.

మిర్చి తోటల్లోకి చేరిన నీరు

మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. మండలకేంద్రంలో 32.4,పేరూరులో 44 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయింది. ప్రస్తుత వర్షాల కారణంగా మిర్చి తోటల్లో నీరు చేరింది. మొక్కలను రక్షించుకోవడం కోసం రైతులు పల్లం వైపు కాల్వలను తీసి నీటిని మళ్లిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి గోదా వరికి వస్తున్న వరద కారణంగా ఇబ్బందులు పడకుండా అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement