హెచ్‌ఐవీపై విద్యార్థులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీపై విద్యార్థులకు అవగాహన

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

ములుగు: జిల్లాకేంద్రంలోని అరవింద పాఠశాలలో శుక్రవారం తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించి విద్యార్థులకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించినట్లు సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్‌ నరేష్‌, ఔట్రీచ్‌ వర్కర్‌ టి.కిషనన్‌ తెలిపారు. హెచ్‌ఐవీ సాధారణ స్పర్శ, కలిసి భోజనం చేయడం, దుస్తులు లేదా మరుగుదొడ్లు పంచుకోవడం ద్వారా వ్యాపించదని వివరించారు. బాధితులపై వివక్ష చూపకూడదని, ప్రతి గర్భిణీ హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన

పెంచుకోవాలి

వెంకటాపురం(ఎం): విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె.చండీశ్వరి దేవి అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌లోని కేజీబీవీలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. బాల్యవివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం, సైబర్‌ నేరాలు, బాలకార్మికుల నిషేధ చట్టం, ఉచిత నిర్భంద విద్యా హక్కు చట్టాలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చట్టపరంగా అందుబాటులో ఉన్న సహాయాన్ని వినియోగించుకోవాలని, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలో తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులకు అందుతున్న భోజనం, వసతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

సీజనల్‌ వ్యాధులపై

అప్రమత్తత అవసరం

వెంకటాపురం(ఎం): సీజనల్‌, అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సూచించారు. శుక్రవారం మండలంలోని రాజేశ్వరరావుపల్లిలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వ ఉండకుండా చూడటం, దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యసిబ్బందికి సూచించారు. శిబిరంలో 72 మంది వైద్యసేవలు పొందగా, జ్వరం కేసులకు మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించారు. నాలుగు అధిక రక్తపోటు, మూడు మధుమేహం కేసులను గుర్తించి చికిత్స అందించారు. అనంతరం వెంకటాపురం పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌ఓ మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement