వాజేడు: ఉపాధ్యాయులు, సిబ్బంది హెడ్ క్వార్టర్‌లోనే ఉండాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న మెనూ వివరాలతో పాటు సిలబస్, విద్యాబోధన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు.
పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


