ములుగు రూరల్: గణేశ్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం నిమజ్జనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీజేలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవడంతో పాటు శోభాయాత్రను నిర్వహించుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్‌తో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించి యువతకు పండుగ నిర్వహించడంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.


