ములుగు/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని సుభాశ్‌నగర్‌లో సుభాశ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణనాథుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నిర్వహించిన కుంకుమార్చనకు మహిళలు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం సమయంలో 108 రకాల ప్రసాదాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం 31 దీపాలతో హారతి నిర్వహించారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 5వ వార్డులో విఘ్నేశ్వరుడికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటల ప్రసాదాన్ని సమర్పించి ప్రత్యేక పూజలను అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ సమర్పించారు.


