సౌకర్యాలు నిల్‌! | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాలు నిల్‌!

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

బొగత జలపాతం

(ఫైల్‌)

బొగతలో కానరాని అభివృద్ధి పనులు

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి అటవి ప్రాంతంలో తెలంగాణ నయగారగా పేరుగాంచిన బొగత జలపాతం పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తోంది. బొగత జలదారలను చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తుంటారు. అలాంటి జలపాతం వీక్షించేందుకు వచ్చే వారికి సౌకర్యాలు కరువయ్యాయి. జలపాతం పరిసరాల అభివృద్ధిపై అధికారులు పట్టించుకోకపోవడంతో గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులు నేడు కళావిహీనంగా మారుతున్నాయి. చిలుకల పార్కులో ఇంకా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని సందర్శకులు కోరుతున్నారు.

మూలనపడిన జిఫ్‌ సైకిల్‌

జలపాతం వద్ద ఏర్పాటు చేసిన జిఫ్‌ లైన్‌, జిఫ్‌ సైకిల్‌ మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల్లో యువతీయువకులు జిఫ్‌లైన్‌, జిఫ్‌ సైకిల్‌పై సరదాగా గడిపేవారు. అలాంటిది మూలన పడటంతో వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.

చిమ్మ చీకటి..

ప్రధాన గేటు నుంచి బొగత జలపాతం వరకు రహదారి వెంట సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక్క లైట్‌ కూడా వెలుగడం లేదు. అన్ని లైట్లకు సంబంధించిన కనెకన్షన్లు తొలగించారు. సాయంత్రం సమయంలో విద్యుత్‌ వెలుగులతో కళకళలాడే ప్రదేశం ప్రస్తుతం చీకట్లతో ఉంటుంది.

రెస్టారెంట్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

జలపాతం చూసేందుకు వచ్చే సందర్శకులు భోజనానికి ఇబ్బందులు పడకుండా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెస్టారెంట్‌ నిర్మించి ప్రారంభించారు. రెస్టారెంట్‌ నడిచిన సమయంలో భోజనం కోసం పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. అయితే గతేడాది రెస్టారెంట్‌ మూలన పడింది. ప్రభుత్వ సకల్పం, కలెక్టర్‌ సహదేవరావు చొరవతో తిరిగి రెస్టారెంట్‌ను మంత్రి సీతక్క మూడు నెలల క్రితం తిరిగి పునఃప్రారంభించారు.

మూలనపడిన ఆటోలు

పర్యాటకులు లోపలికి ప్రవేశించిన తర్వాత బొగత జలపాతం వద్దకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఆటోలు ప్రస్తుతం నడవడం లేదు. అవి మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. వాటిని బాగు చేయించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. రైదర్‌ మాత్రమే ప్రస్తుతం నడుస్తుంది.

పర్యాటక శాఖ

ప్రత్యేక దృష్టి సారించాలి..

పర్యాటకులను ఆకట్టుకునే బొగత జలపాతం అభివృద్ధిపై పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టిని సారించాలి. జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపేందుకు సకల సౌకర్యాలు కల్పించాలి. గతంలో చేసిన అభివృద్ధి పనులు మరుగున పడుతున్నప్పటికి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.

వెలగని సోలార్‌ లైట్లు

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement