నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

ములుగు: వినాయక చవితి నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు ఆదేశించారు.కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండపాల నిర్వాహకులు పోలీస్‌శాఖ అనుమతి పొందిన తర్వాతే మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల వద్ద అవాంఛనీయ కార్యకలాపాలకు తావివ్వకూడదన్నారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్‌ పరికరాలను సురక్షితంగా ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర వైద్యసేవలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం తన ఛాంబర్‌లో కలెక్టర్‌ మట్టి గణేశ్‌ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు, జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, టీజీపీసీబీ నోడల్‌ ఆఫీసర్‌ అరుణదేవి, డీపీఆర్వో రఫీక్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement