గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో అడ్వాన్సింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండస్ట్రీయల్ అప్లికేషన్ ప్రధాన అంశంగా సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు మలేషియాలో జరిగే 9వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ టెక్నోప్రెన్యూర్‌షిప్–ఐసీఐటీ– 2026 సదస్సులో లక్ష్మణ్ నాయక్ పాల్గొననున్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


