7
రామప్ప దేవాలయ పరిరక్షణకు ప్రాధాన్యం
● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాపురం(ఎం) మండల కేంద్ర పరిధిలో చేపడుతున్న ఓపెన్ కాస్ట్ మైనింగ్ పనుల వల్ల రామప్ప దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఏర్పాటుకు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం మంజూరు అంశాలపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. రామప్ప దేవాలయ పరిరక్షణ, పర్యావరణం, శాసీ్త్రయ అధ్యయనాలు, నిరంతర పర్యవేక్షణతోపాటు సంబంధిత నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా చర్చించారు. సంబంధిత శాఖల అధికారులు, కమిటీ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను నమోదు చేశామని, అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, సింగరేణి భూపాలపల్లి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీఎం దేవేందర్, పర్యావరణ విభాగం జీఎం సైదులు, ఎక్స్‌ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సునీత, పురావస్తు శాఖ సహాయ సంచాలకురాలు గంగాదేవి, భారత పురావస్తు సర్వేక్షణ శాఖ సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్లు అజిత్, వంశీకృష్ణ, జ్యోతి, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు శ్రీధర్‌రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, పాలంపేట సర్పంచ్ రాజు, డీపీఓ వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఇరిగేషన్ ఈఈ నారాయణ, వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
తన భావాలకే కాదు శరీరానికీ మరణం
లేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. నిజాం పాలన వ్యతిరేక ఉద్యమం, తదనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన అక్షర యోధుడు. ప్రజల భాషలో ఉండే ఆయన కవితలు.. పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే రచనలు జనాల గుండెలను అలల తాకేవి. నేడు ఆయన జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం కూడా.
ఉద్యమాలతో
ముడిపడిన జీవితం
నిరంతరం
పోరాటాల బాటే..
నేడు ప్రజాకవి జయంతి


