అధిక రుసుం వసూలు చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక రుసుం వసూలు చేస్తే చర్యలు

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

ములుగు: జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మహేందర్‌ జీ హెచ్చరించారు. మీసేవ నిర్వహకులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మీసేవ నిర్వాహకులు అధిక రుసుం తీసుకున్నట్లు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే మీసేవ కేంద్రాల అనుమతులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మీసేవ కేంద్రాల్లో సిటిజన్‌ చార్టర్‌, రేట్‌ చార్ట్‌, భూభారతి ఫ్లెక్సీలు, నేమ్‌ బోర్డు, తాగునీరు, పవర్‌ బ్యాకప్‌ తదితర సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, అనుకోకుండా కేంద్రాలను మూసివేయాల్సి వస్తే ముందస్తుగా జిల్లా పరిపాలనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని ఆధార్‌ కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లోనే నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ శివకుమార్‌, ఈ–డిస్ట్రిక్‌ మేనేజర్‌ దేవేందర్‌, మీసేవ జిల్లా మేనేజర్‌ విజయ్‌ పాల్గొన్నారు.

అక్షరజ్ఞానంతోనే

సమాజంలో గుర్తింపు

ములుగు: మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉంటేనే కుటుంబంతోపాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా పీడీ రవీందర్‌ అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు చదవడం, రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అక్షరాస్యతతోనే మహిళా సాధికా రత సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌, మహిళ సమాఖ్యల ప్రతినిధులు మాధవి, రమణి, సునీత, సౌజన్య, లక్ష్మి, స్వరూప, సరిత, అనూష, శ్వేతా, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

‘రామప్ప’ను సందర్శించిన ఎండోమెంట్‌ ఏసీ సునిత

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ఉమ్మడి వరంగల్‌ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామాల సునిత మంగళవారం సందర్శించా రు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌.. ఏసీ సునితను శాలువా తో సత్కరించారు. అనంతరం ఇటీవల పునరుద్దరించిన సోమసూత్రాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా.. రామప్ప దేవాలయాన్ని మంగళవారం దక్షిణ కొరియా దేశానికి చెందిన జోంగ్‌ సీ పార్క్‌ సందర్శించారు. ఆలయ విశిష్ట త గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని కొని యాడారు. వందల సంవత్సరాల క్రితమే రాతితో ఇంతటి గొప్ప నిర్మాణం చేపట్టడం నాటి పాలకులు వారి కళాపోషణకు నిదర్శనమని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్‌, ఆలయ పూజారులు హరీష్‌ శర్మ, ఉమాశంకర్‌, గైడ్‌ వెంకటేష్‌, టూరిస్ట్‌ పోలీసులు శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఆలయాల పునాది పనులు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. మంగళవారం శ్రీసుబ్రహ్మస్వామి ఆలయం నిర్మాణం కోసం 12 ఫీట్ల లోతున కాంక్రీటు నిర్మాణం చేశారు. శ్రీశుభానందదేవి(పార్వతి) అమ్మవారి ఆలయం స్టోన్‌తో పునా ది పనులు జరుగుతున్నాయి. ఉత్తరం వైపున ప్రహరీ పెంచేందుకు ప్రస్తుతమున్న శివకల్యాణ మండపం సగం వరకు తొలగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement