వెంకటాపురం(ఎం): మండలకేంద్రం శివారులో ప్రారంభించే ఓపెన్‌కాస్టు గని ప్రాంతాన్ని సోమవారం ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సింగరేణి సంస్థ భూపాలపల్లి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళీ మోహన్‌లు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. గని ప్రాంతం ఎంతమేర ఉంది అనే ఆంశాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించారు. ప్రస్తుతం ఆ భూముల్లో సాగవుతున్న పంటలు ఏంటి.. అనే వివరాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ హేమంత్ సహదేవరావును సింగరేణి సంస్థ అధికారులు కలిసి మాట్లాడారు. ఓపెన్‌కాస్టు ప్రాంతంలో నిర్వహించిన శాసీ్త్రయ అధ్యయనాల్లో వెల్లడైన అంశాలు, వాటి ఆధారంగా చేపట్టాల్సిన చర్యలు, పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జీఎం దేవేందర్, ఎన్విరాన్‌మెంట్ జీఎం సిద్ధులు పాల్గొన్నారు.


