అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు ఇవ్వాలి

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

సుదర్శన్‌ రెడ్డి

ములుగు: ఎస్‌ఐఆర్‌లో అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేటగిరీలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీసులు అందించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్‌ పురోగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 41,900 నోటీసులు సిద్ధం చేసి ఇప్పటివరకు 24,394 నోటీసులు జారీ చేసి వివరాలను యాప్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. నిర్ణీత గడువులో విచారణ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వీసీలో జిల్లా నుంచి ఆర్డీఓ కృష్ణవేణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement