క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్యం

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

ములుగు రూరల్‌: క్షయ వ్యాధి నివారణలో పోషకాహారం ముఖ్య పాత్ర పో షిస్తుందని జిల్లా టీబీ నియంత్రణ అధికారి రవితేజ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో క్షయ వ్యాధి నియంత్రణపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్‌ కిట్‌, డైరెక్టరీ బెనిఫిషరి స్కీమ్‌ కింద నెలకు రూ.1000 చొప్పున అందరికీ అందించాలన్నారు. న్యూట్రిషన్‌ కిట్‌లో నూనె, ప్రోటీన్‌పౌడర్‌, గుడ్లు, పప్పు మొదలైనవి ఉంటాయన్నారు. క్షయ వ్యాధి నియంత్రణలో సిబ్బంది నిబద్ధతతో పని చేయాలన్నారు. క్షయ కేసులను గుర్తించడంలో నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకారం స్క్రీనింగ్‌ నిర్వహించాలని, క్షయ వ్యాధి నివారణలో భాగంగా ఇంట్లో ఉన్న వారికి సైతం ప్రెసెంటివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వటం ద్వారా 90 శాతం క్షయ రాకుండా ఆపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ దుర్గరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement