అవయవదానంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

అవయవదానంపై అవగాహన

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

ములుగు: అవయవదానంతో ఆరిపోతున్న జీవితా లకు వెలుగునివ్వాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహధ్యక్షుడు డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం అవయవదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక ఉద్యమాల దళపతి ముంజాల భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ అశోక్‌ మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపునివ్వవచ్చని, పార్థివదేహాన్ని వైద్య కళాశాలకు దానం చేయడం ద్వారా భవిష్యత్‌ వైద్యులకు గురువుగా నిలవవచ్చన్నారు. చనిపోయిన తర్వాత కూడా అవయవదానం ద్వారా చిరంజీవులుగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కె. న రసయ్య, ఎం.గోపాల్‌రెడ్డి, కుమ్మరి వెంకట్‌, స్థానికులు పాల్గొని అవయవదాన ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement