వయోవృద్ధులను గౌరవించాలి | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధులను గౌరవించాలి

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

భూపాలపల్లి రూరల్‌: కుటుంబాలకు పునాది పెద్దవారేనని, వారిని గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ జీవన్‌ కుమార్‌ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఓల్డేజ్‌ హోమ్‌లో వరల్డ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ డే కార్యక్రమం నిర్వహించారు. జీవన్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దవారిపట్ల గౌరవ మర్యాదలు పాటించాలన్నారు. వారిని ఇబ్బంది పెడితే చట్టాలు కఠినంగా శిక్షిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోమ్‌ నిర్వాహకులు శ్యామ్‌ ప్రసాద్‌, శైలజ, కోర్డు సూపరింటెండెంట్‌ రఘురాం,సీనియర్‌ అసిస్టెంట్‌ సురేందర్‌, సిబ్బంది అంబాల దేవేందర్‌, గోపాల్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement