అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం

Aug 16 2026 5:27 AM | Updated on Aug 16 2026 5:27 AM

ములుగు

7

ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026

ములుగు రూరల్‌: జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌తో కలిసి మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్య్ర సమరయోధుడు చిందం రాజమల్లును శాలువాలతో సన్మానించారు. స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థుల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఆధ్వర్యంలో సీపీఆర్‌, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.

1,636 ఇళ్ల నిర్మాణం పూర్తి

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. జిల్లాలో 4,956 గృహాలకు మార్కింగ్‌ పూర్తి చేయగా అందులో 1,636 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ములుగు జనరల్‌ ఆస్పత్రిలో కోటి రూపాయల వ్యయంతో అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. యూడీఐడీ కేంద్రంతో పాటు రూ.20 లక్షల నిధులతో గైనిక్‌, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ ఆపరేషన్‌ థియేటర్లను ప్రారంభించామని వివరించారు. అలాగే ఏటూరునాగారంలో 100 పడకల ఆస్పతికి అదనంగా మరో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రూ.23 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా జిల్లాలోని మహిళలకు రూ.147.61కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

984 మహిళా సంఘాలకు.. రూ.79.58కోట్లు

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 95 అంగన్‌వాడీ పోస్టులు, 329 ఆయా పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆసరా పథకం కింద 37,353 మంది లబ్ధిదారులకు రూ.9.7కోట్లను ప్రతినెలా అందిస్తున్నామని తెలిపారు. 2026–27 సంవత్సరానికి బ్యాంకు లింకేజీ కింది 984 మహిళా సంఘాలకు రూ.79.58కోట్ల రుణాలు, సీ్త్రనిధి ద్వారా 90 సంఘాలకు రూ.3.76 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు గాను రూ.143.40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో 7,556 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుందని వెల్లడించారు.

80,828 మంది రైతులకు రైతుభరోసా

రైతు భరోసా ద్వారా జిల్లాలో 80,828 మంది రైతుల ఖాతాలలో రూ.100.30 కోట్లు జమ చేసినట్లు వివరించారు. జిల్లాలో రేషన్‌ కార్డుదారులు 2,94,897 మందికి 1,933 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 171 గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.22.26కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సీఆర్‌ఆర్‌ గ్రాంట్‌ కింద రూ.111.4 కోట్లతో 111 రోడ్డు పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్నల్‌ సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులను రూ.36.50 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 2,491 మంది గిరిజనులకు రూ. 27.17కోట్లతో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా రూ.23 లక్షలతో 64 వేల మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, డీఎఫ్‌ఓ వికాస్‌మీనా, అదనపు ఎస్పీ సదానందం, డీఆర్‌ఓ రవికుమార్‌, ఆర్డీఓ కృష్ణవేణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, ప్రజాప్రతనిధులు పాల్గొన్నారు.

పొట్లాపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.143 కోట్లు

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు

రాష్ట్ర పంచాయతీరాజ్‌,

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో

ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement