కేయూ క్యాంపస్: కేయూ సైన్స్ విభాగాల డీన్‌గా ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆబాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ జి.హనుమంతు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకట్రాంరెడ్డి గతంలో ఫిజిక్స్ విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, పరీక్షల నియంత్రణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన కేయూ ఓఎస్‌డీగా టీజీఎడ్‌సెట్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండేళ్లపాటు ఆయన సైన్స్ విభాగాల డీన్‌గా కొనసాగనున్నారు. వీసీ ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు.


