టికెట్ల జారీలో ఆగని అవినీతి!
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరో సారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే.. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్‌లైన్ టికెట్లు జారీ చేయకుండా మ్యాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలా డింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మ రోసారి ఆన్‌లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టా యి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 శుక్రవారం వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘాలోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలు న్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై దేవాలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి ఎక్కడా జరగలేదని, సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో కేవలం ప్రసాదాల అమ్మ కం ద్వారా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. పూజల అనంతరం భక్తులు సంతోషంగా ఇచ్చే సంభావన తీసుకోవాలి తప్ప పూజారులు డిమాండ్ చేయవద్దని గతంలోనే ఆదేశించినట్లు తెలిపారు.
భద్రకాళి ఆలయ ఘటనపై
సోషల్ మీడియాలో హల్‌చల్..


