బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఆర్‌బీ డీఎస్పీ, ఆపరేషన్ స్మైల్ –12 కార్యక్రమ జిల్లా ఇన్‌చార్జ్ కిశోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం మేడారంలోని హరిత హోటల్‌లో బాలల పరిరక్షణ జిల్లా అధికారి ఓంకార్ అధ్యక్షతన నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైనర్లను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేడారం జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార వృత్తిదారులు, భిక్షాటన చేసేవారిలో బాలకార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలన్నారు. పిల్లలు చదువుకుంటనే వారి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ వసుధ మట్లాడుతూ.. బాల్యం అమూల్యమైన దశ అని 14 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ.. బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ మధు, ఎస్సై ఇమ్మాన్యూఝెల్, హరికృష్ణ, సంజీవ, రజిని, విక్రమ్, గీత, చంటి, తదితరులు పాల్గొన్నారు.
తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ములుగు రూరల్: జిల్లాలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిసే్‌ట్రషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ రిజిసే్‌ట్రషన్‌లో రైతులకు గుర్తింపు నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. రైతులు పట్టాదార్ పాస్ బుక్‌తో రైతులు తమ సమీపంలోని మీసేవా కేంద్రం, వ్యవసాయ విస్తర్ణాధికారిని సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. యాసంగి పంటలకు సంబంధించి జిల్లాకు కావాల్సి యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వపరంగా వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణం కోసం చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని ధన్వాడ గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వాడ క్లస్టర్ పరిధిలోని ధన్వాడ, రేగులగూడెం గ్రామాలకు చెందిన 29 ఎకరాలకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఉన్న రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదవి వినిపించారు. అభ్యంతరాలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నేడు (శనివారం) ఒడిపిలవంచ (ఒడిపిలవంచ, ఆదివారంపేట, గుమ్మళ్లపల్లి, వీరాపూర్) క్లస్టర్ సంబంధించిన భూ సేకరణ గ్రామసభ జరగనున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, ఆర్‌ఐ వెంకన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఉత్తమ పరిశోధనలకు పారితోషికం
కేయూ క్యాంపస్: ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించేందుకు పరిశోధనపత్రం, ఉత్తమ ప్రాజెక్టు ఉత్తమ ప్రచురణలకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం తెలిపారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు వర్సిటీలోని వివిధ విభాగాల డీన్‌లకు, వర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, పరిశోధక విద్యార్ధులు ఈ అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. మొదటి బహుమతి కింద రూ.15,000, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలతోపాటు ఈఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 10లోపు అకడమిక్ బ్రాంచ్‌లో ఆధారాలతోపాటు దరఖాస్తుల సమర్పించాలని సూచించారు.
బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు


