ఆర్చి పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఆర్చీ ద్వారాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. సారలమ్మ ప్రధాన ఆర్చీ ద్వారం రాతి స్తంభాలపై సిమెంట్ బీమ్ ఏర్పాట్ల పనులను శుక్రవారం పూజారులతో కలిసి కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్చీ ద్వారంపై ఏర్పాటు చేసిన బీమ్, మోడల్ క్యూ నిర్మాణ పనులతోపాటు గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సారలమ్మ ఆర్చీ ద్వారంపై వనదేవత వంశవృక్షం, కోయ బొమ్మల లిపి, చిత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్ ఉన్నారు.


