ఏఆర్‌కు మారిన పోలీస్ సిబ్బందికి సన్మానం
గోవిందరావుపేట: 5వ బెటాలియాన్‌లో విధులు నిర్వహిస్తున్న 9 మంది టీజీఎస్పీ సిబ్బంది.. ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) విభాగానికి మారిన సందర్బంగా బెటాలియాన్ కమాండెంట్ కే.సుబ్రహ్మణ్యం వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వారి సేవా కాలంలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం ప్రశంసనీయమని అన్నారు. ఏఆర్ విభాగంలోనూ ఇదే ఉత్సాహంతో, ప్రజల భద్రతకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. సన్మాన కార్యక్రమంలో ఆర్‌ఐలు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.


