వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ
మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారి జీడికంటి వదుసుదనాచార్యులు వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 16 నుంచి కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆలయంలోని గోదాదేవి అమ్మవారికి పూజారి వదుసుదనాచార్యులు వేద మంత్రోశ్చరణ నడుమ సారె సమర్పణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయకమిటీ బాధ్యులు, భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు నూతన పట్టు వస్త్రాలు, వివిధ రకాల పిండి వంటలు, పండ్లతో మంగళవాయిద్యాల నడము ఆలయానికి చేరుకుని సారె సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. ఈనెల 13న గోదాదేవి కల్యాణ మహోత్సవంతో ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయని పూజారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, గౌరవ అధ్యక్షులు దేవకి, కరి వెంకాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్ల కొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి పూసాల సరోజి, భక్తులు మన్నె నాగేశ్వర్‌రావు, కడియాల సుదర్శన్, శ్రీనివాస్, గుజ్జుల కోటిరెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ


