మహిళా ఓటర్లే అధికం | - | Sakshi
Sakshi News home page

మహిళా ఓటర్లే అధికం

Jan 3 2026 7:26 AM | Updated on Jan 3 2026 7:26 AM

మహిళా

మహిళా ఓటర్లే అధికం

మహిళా ఓటర్లే అధికం 10న ఓటరు తుది జాబితా

మొత్తం ఓటర్లు 14,112

ములుగు మున్సిపాలిటీ పరిధిలో 14,112 మంది ఓటర్లు

ములుగు: జిల్లా కేంద్రంగా ఉన్న ములుగు 2024 ఫిబ్రవరి 2న మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను కలుపుకొని ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా.. తొలిసారి మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ములుగు మున్సిపాలిటీ అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేశారు. కాగా, ములుగు మున్సిపాలిటీ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

20 వార్డులు.. 20 పోలింగ్‌ బూతులు

ములుగు మున్సిపాలిటీలో ప్రాథమికంగా ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్‌ విడుదల చేయడంతో మున్సిపల్‌ కమిషనర్‌ గత మూడు రోజులుగా కసరత్తు ప్రారంభించి ప్రాథమిక ఓటర్ల జాబితాను ప్రకటించారు. జిల్లాలో 20 వార్డులకు గాను 20 పోలింగ్‌ బూతులను ఏర్పాటు చేస్తుండగా 14,112 మందితో ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో 6,731 మంది పురుషులు, 7,379 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 వేల జనాభా ఉండగా 1,844 మంది ఎస్టీలు, 2,470 మంది ఎస్సీలు ఉండగా మిగిలిన జనాభాలో బీసీ, ఓసీలు ఉన్నారు.

నేటి వరకు అభ్యంతరాల స్వీకరణ

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే మున్సిపాలిటీలో వార్డుల వారీగా ప్రదర్శించారు. ప్రకటించిన ఓటరు జాబితాపై శనివారం(నేడు) వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పేర్లు, వార్డుల మార్పుల్లో ఏమైనా తప్పులు ఉంటే అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించనున్నారు. ఓటరు జాబితాపై 5వ తేదీన రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ నాయకుల నుంచి వచ్చే అభ్యంతరాలను సైతం పరిష్కరిస్తారు. ఈనెల 10న మున్సిపాలిటీ పరిధిలోని తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో..

ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. దీంతో ఇదే ఉత్సాహంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు నాయకులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. రెండేళ్ల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినప్పటికీ హస్తం హవానే కొనసాగింది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండడంతో జాతర ముగిసిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ. ఓటర్ల తుది జాబితా అనంతరం రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సన్నహాలు చేపడుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు రానుండడంతో ఇప్పటికే ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలను మొదలు పెట్టారు.

ఈనెల 10న ఓటరుల తుది జాబితాను ప్రకటిస్తాం. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డుల పరిధిలో 14,112 మంది ఓటర్లు ఉన్నారు. శనివారం వరకు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తాం. 5న వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సమావేశాన్ని నిర్వహించి సలహాలు తీసుకుంటాం. తుది జాబితా ప్రకటించాక ఎన్నికల సంఘం ఆదేశానుసారం ముందుకు వెళతాం.

– జనగాం సంపత్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, ములుగు

వార్డు పురుషులు మహిళలు ఇతరులు

1 323 350 0

2 348 412 1

3 344 410 0

4 374 375 0

5 315 378 0

6 330 321 0

7 362 364 0

8 360 370 0

9 300 330 0

10 353 396 1

11 338 363 0

12 372 397 0

13 333 375 0

14 369 420 0

15 352 357 0

16 315 344 0

17 328 327 0

18 295 353 0

19 288 345 0

20 332 392 0

మున్సిపాలిటీగా ఆవిర్భంచిన తర్వాత తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 14,112 మంది ఓటర్లతో 20 వార్డులు ఏర్పాటు చేయగా 20 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పురుషుల కంటే 648 మంది మహిళ ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం. మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపితే అటువైపే గెలుపు ఉంటాయని చర్చించుకుంటున్నారు.

పురుషుల కంటే 648 మంది

మహిళా ఓటర్లే ఎక్కువ

5న పార్టీల ప్రతినిధులతో సమావేశం

10న తుది ఓటరు జాబితా విడుదల

మహిళా ఓటర్లే అధికం1
1/3

మహిళా ఓటర్లే అధికం

మహిళా ఓటర్లే అధికం2
2/3

మహిళా ఓటర్లే అధికం

మహిళా ఓటర్లే అధికం3
3/3

మహిళా ఓటర్లే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement