మధ్యాహ్నమే పీహెచ్‌సీకి తాళం
కాళేశ్వరం: కొత్తసంవత్సరం పూట పీహెచ్‌సీలకు ఏమైనా సెలవు ప్రకటించారా.. లేదా ఉద్యోగులు అంతా లీవులో ఉన్నారా అనే అనుమానాలు కాళేశ్వరంలో వెల్లువెత్తాయి. గురువారం మధ్యాహ్నమే పీహెచ్‌సీకి తాళాలు వేసి వైద్యులు, సిబ్బంది బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు ఉండి రోగులకు సేవలందించాల్సిన సిబ్బంది, వైద్యబృందం ఆన్‌డ్యూటీలో వ్యక్తిగతంగా ఒంటిపూట సెలువు తీసుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం అయినందున ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.


