వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ | - | Sakshi
Sakshi News home page

వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ

Jan 2 2026 11:31 AM | Updated on Jan 2 2026 11:31 AM

వాణిజ

వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ

వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ అంబులెన్స్‌లో ప్రసవం ఎట్టకేలకు రోడ్డు నిర్మాణం విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

సీసీటీ ఆఫీస్‌కు రావుల శ్రీధరాచారి

వరంగల్‌ జాయింట్‌ కమిషనర్‌గా టి.శ్రీనివాస్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వాణిజ్యపన్నులశాఖ వరంగల్‌ జాయింట్‌ కమిషనర్‌ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్‌ కమర్షియల్‌ టాక్స్‌ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్‌లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్‌ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్‌లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్‌లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

కన్నాయిగూడెం: అంబులెన్స్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గుర్రేవులకు చెందిన వాసంపెల్లి మహేశ్వరి నిండు గర్భిణి. బుధవారం రాత్రి పురటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డ సమీపంలో 163వ జాతీయ రహదారిపై ఏర్పడిన గోతులను ఎట్టకేలకు గురువారం పూడ్చివేశారు. ‘సాక్షి’లో పలుమార్లు ఈ గోతులపై కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో 163వ జాతీయ రహదారి అధికారులు స్పందించి గోతులను పూడ్చివేసి బీటీ నిర్మాణం చేపట్టారు. దీంతో ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలను తెలిపారు.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి టింగి చందు అండర్‌–14 వాలీబాల్‌ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి ఎం.రాజేందర్‌ గురువారం విద్యార్థిని భూపాలపల్లిలో అభినందించారు. తిరుపతిలో జరిగిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో శ్రీఐ బ్రో కోడింగ్‌శ్రీ ప్రదర్శన చేసిన మాడిగ స్నిగ్ధ, వెలగందుల తణ్మయి, గైడ్‌ టీచర్‌ మధు, శ్రీజీవ వైవిధ్య పరిరక్షణశ్రీ అంశంపై ప్రెజెంటేషన్‌ చేసిన టీచర్‌ ప్రభాకర్‌ రెడ్డి, క్రీడల్లో శిక్షణ అందించిన పీడీ సిరంగి రమేష్‌లను కూడా సత్కరించారు.

ఆర్టీసీ డ్రైవర్లు

అప్రమత్తంగా ఉండాలి

భూపాలపల్లి అర్బన్‌: ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీటీఓ సందాని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీటీఓ హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ సొంత భద్రత కోసం డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఇందూ, ఏఎంటీ అమృత, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

వాణిజ్యపన్నులశాఖ  జేసీ బదిలీ1
1/2

వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ

వాణిజ్యపన్నులశాఖ  జేసీ బదిలీ2
2/2

వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement