‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’

May 8 2025 12:40 AM | Updated on May 8 2025 12:40 AM

‘విధి నిర్వహణలో  జాగ్రత్తలు పాటించాలి’

‘విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’

ములుగు: విధి నిర్వహణలో ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్పీడీసీఎల్‌ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల డీఈలు పులుసం నాగేశ్వరరావు, వెంకటేశం అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సబ్‌ డివిజన్ల విద్యుత్‌ సిబ్బందితో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎల్‌సీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం భద్రతా వారోత్సవాల వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిబంధనలు పాటించాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్‌, ఏఈలు, సబ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement