‘సీతక్కను విమర్శించే స్థాయి నాగజ్యోతికి లేదు’
గోవిందరావుపేట: రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను విమర్శించే స్థాయి బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతికి లేదని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల మహిళ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. బడే నాగజ్యోతి కావాలనే మంత్రి సీతక్కను విమర్శిస్తుందని తెలిపారు. అలా విమర్శలు చేస్తే పెద్ద నాయకురాలిగా గుర్తింపు వస్తుందనే భ్రమలో ఉందని విమర్శించారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి కొందరు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నాగజ్యోతికి రాజకీయ భిక్ష పెట్టింది సీతక్కనే అని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో ఐదేళ్లు జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్, చైర్‌పర్సన్ పదవుల్లో ఉండి జిల్లాలో ఏమి అభివృద్ధి పనులు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీతక్క గురించి మాట్లాడే అర్హత నాగజ్యోతికి లేదని, ఇంకోసారి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా నాయకురాలు సూదిరెడ్డి జయమ్మ, గుండెబోయిన నాగలక్ష్మీ, చొప్పదండి వసంత, తోకల అహల్య, ల్యాగల అనిత, గురుకు మేరీల, గోపిదాసు వజ్రమ్మ, మిరియాల సోమలక్ష్మీ, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
‘వజ్ర’తో అడవుల పరిరక్షణ
ఏటూరునాగారం: జిల్లాలోని అడవులు, వన్యప్రాణి ప్రాంతాల్లో వజ్ర వాహనంతో పరిరక్షణ, పర్యవేక్షణ చేయనున్నట్లు సీసీఎఫ్ ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారి అటవీశాఖ సౌత్ రేంజ్‌పరిధిలో వజ్ర వాహనాన్ని ఆయన మంగళవారం జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వాహనానికి వజ్రగా పేరు నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనం నేషనల్ హైవేపై గస్తీ తిరుగుతూ అటవీ పరిరక్షణకు పాటు పడుతుందన్నారు. ఎవరైనా అటవీ సంరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చిన్న నేరాలకు అప్పటికప్పుడు రూ.25వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పెద్ద నేరాలకు కేసు నమోదైతే 14ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. వన్యప్రాణాలు, అడవులను రక్షించుకోవడం ప్రతీఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీఓ రమేష్, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్, సౌత్ రేంజ్ ఎస్‌ఎఫ్‌ఓలు, ఎఫ్‌బీఓలు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
కంటిచూపు ముఖ్యం
వాజేడు: ప్రతీఒక్కరికి కంటి చూపు ముఖ్యమని ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి నవీన్, ఆప్తాల్మిక్ తిరుపతిరావు అన్నారు. మండల పరిధిలోని చండ్రుపట్లలో మంగళవారం ములుగు జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు సూచన మేరకు కంటివైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా 55మందికి పరీక్షలను చేశారు. రోగులకు దగ్గర, దూరపు చూపు మందగించినట్లు గుర్తించి అందుకు తగ్గ సూచనలను చేశారు. కంటి లోపల కేటరాక్ట్ ఉందా లేదా అని పరీక్షించారు. ఇతర సమస్యలను పరీక్షించి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే ఏఎన్‌ఎం విజయ, ఆరోగ్య కార్యకర్త తిరుపతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ
వెంకటాపురం(కె): మండల పరిధిలోని సూరవీడు సమీపంలోని మిర్చి తోటల్లో పనిచేస్తున్న కూలీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బంది కూలీలకు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళ కేంద్రంలో 84 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారిలో 21 మంది మహిళల వద్ద రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ములుగు ఏరియా వైద్య శాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహరెడ్డి, పవన్, వినయ్ పాల్గొన్నారు.
‘సీతక్కను విమర్శించే స్థాయి నాగజ్యోతికి లేదు’
‘సీతక్కను విమర్శించే స్థాయి నాగజ్యోతికి లేదు’


