
దాతలిచ్చిన భూమి మాకే కేటాయించాలి..
గతంలో సాధన హైస్కూల్ సమీపంలో గట్టంపల్లి గ్రామం ఉండేది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంతో బూడిదయ్యింది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రేమ్‌నగర్‌లోని 1076, 1078 సర్వే నంబర్లలో దాతలు ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 5గుంటల చొప్పున కేటాయించింది. మాతాతలు ఇళ్లుకట్టుకున్నారు. తదనంతరం కూలిపోవడంతో మాతో పాటు మరో ఐదు కుటుంబాలకు చెందిన దళితులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. ఆ ప్రదేశంలో ప్రస్తుతం రామ చంద్రారెడ్డి అనే వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి ఇళ్లు లేకపోయినా తన కుమారుల పేరుమీద ఇళ్లు ఉన్నట్లుగా సృష్టించుకున్నారు. ఇది తమ భూమి అని చెప్పినా పట్టించుకోవడం లేదు. గ్రామస్తులను విచారిస్తే స్థలం తమదేనని చెప్తారు. గ్రామ పంచాయతీని ఆశ్రయిస్తే ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపేద దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి. – కాకి సతీష్, ప్రేమ్‌నగర్, ములుగు