ఇసుక క్వారీ నిర్వహణకు ఏకగ్రీవ తీర్మానం
మంగపేట: మండలంలోని కత్తిగూడెం ఇసుక క్వారీ నిర్వహణను శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యాక్స్ లిమిటెడ్‌కు అప్పగిస్తూ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. పంచాయతీ పరిధి రిజిస్టర్డ్ ఇసుక లేబర్ సొసైటీల్లో ఇసుక రీచ్ నిర్వహణ కోసం సొసైటీని గుర్తించేందుకు జీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి చెదలవాడ కృష్ణాజీ అధ్యక్షతన గురువారం పెసా గ్రామ సభ నిర్వహించారు. ఎంపీడీఓ భద్రు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ భిక్షపతి పెసా నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో శ్రీ ఆంజనేయ, సమ్మక్క సారక్క రెండు సొసైటీలు ఉండగా.. సమక్క సార క్క సొసైటీ ఆడిట్ లేకపోవడంతో శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక క్వారీ, మొరం క్వారీ లేబర్ కాంట్రాక్ట్ మ్యాక్స్ లిమిటెడ్‌కు క్వారీ నిర్వహణ బాధ్యతలు నిర్వహించేందుకు సొసైటీ సభ్యులు 12 మంది అంగీకరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. నివేదికను ఉ న్నతాధికారులకు పంపిస్తామని ఎంపీడీఓ వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ కారోబార్ వల్లి శ్రీను, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


