ఇంటిపై పడిన తాటిచెట్టు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో నివాసం ఉంటున్న కై ంసర్తి ప్రేమలత ఇంటిపై ఆదివారం కురిసిన భారీ వర్షానికి తాటిచెట్టు విరిగి ఇంటిపైకప్పు పై పడింది. దీంతో ఇల్లు దెబ్బతింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
మట్టల ఆదివారం వేడుకలు
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని సెటినరీ మెథడిస్టు చర్చిలో ఆదివారం క్రైస్తవులు ఘనంగా మట్టల ఆదివారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం చర్చి ఫాస్టర బాలరాజు మాట్లాడుతూ ఈస్టర్ పండుగను గుర్తుంచుకుని ఆయన అనుభవించిన శ్రమ దినాలకు గుర్తుగా 40రోజుల పాటు ఉపవాసం ఉంటారని తెలిపారు. ఈ ఉపవాస దీక్షలు చివరి వారంలోకి చేరుకున్నాయని తెలిపారు.
సరస్వతీ పుష్కరాల
పనుల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.
శాంతి చర్చలు జరపాలి
భూపాలపల్లి రూరల్: మావోయిస్టులతో శాంతిచర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య విజ్ఞపి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు.
ఇంటిపై పడిన తాటిచెట్టు
ఇంటిపై పడిన తాటిచెట్టు


