ములుగు రూరల్: విద్యార్థినులకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. మండల పరిధిలోని జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం చేపట్టిన రాష్ట్రీయ బాలస్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను, విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున విద్యార్థులు ఎండలో తిరగవద్దన్నారు. వడదెబ్బ తగిలితే ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పత్తిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే టీం సభ్యులు శ్రీలత, మల్లికార్జున్, ఆరోగ్య కార్యకర్తలు ఉపేంద్ర, తిరుతమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


