ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతోపాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్‌ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు సన్మానం..
జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు.
పోలీసుల భారీ బందోబస్తు
కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎస్పీ డాక్టర్ శబరీశ్ పర్యవేక్షణలో డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ రవీందర్, ఎస్‌ఎస్ తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం నుంచే కొండపర్తి గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గవర్నర్ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన రావడంతో పోలీసులు పస్రా నుంచి కొండపర్తి వరకు అడుగడుగునా కట్టుదిట్టమైన భారీ భద్రత చర్యలు చేపట్టారు. మేడారానికి గవర్నర్ దర్శనానికి వెళ్లిన సందర్భంగా కొండపర్తి నుంచి మేడారం వరకు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదివాసీలతో మమేకమైన గవర్నర్
జిష్ణుదేవ్‌వర్మకు ఘనస్వాగతం
పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం
భారీ పోలీసు భద్రత నడుమ సాగిన
పర్యటన
అమ్మవార్లకు మొక్కులు
మేడారం సమ్మక్క – సారలమ్మల గద్దెల వద్ద గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. పూజలు నిర్వహించిన అనంతరం దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు గవర్నర్‌కు పట్టువస్త్రాలను కానుకగా అందించారు.
పులకించిన కొండపర్తి
పులకించిన కొండపర్తి
పులకించిన కొండపర్తి


