Zayed Khan: Farah Khan Threw Chappal on Me During Main Hoon NA Shoot - Sakshi
Sakshi News home page

Zayed Khan: ఫిట్స్‌తో పడిపోతే కట్‌ చెప్పా... కోపంతో డైరెక్టర్‌ నాపై చెప్పులు విసిరింది

May 1 2023 2:33 PM | Updated on May 1 2023 3:28 PM

Zayed Khan: Farah Khan Threw Chappal on Me During Main Hoon Na shoot - Sakshi

నానామాటలు అంది. ఆవేశంతో నా మీదకు తన చెప్పులు విసిరింది. ఓవైపు మనిషి చావుబతుకుల్లో ఉంటే నన్ను డ్యాన్స్‌ చేయమని ఎలా అడుగుతున్నావు? తిరిగి ప్రశ్నించాను. దీనాకమె నా సెట్‌లో కట్‌ చెప్పడానికి నువ్వెవరు? చెప్తే నేను మాత్రమే చెప్పాలి అని అరిచింది.

ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ తనను అందరిముందే తిట్టి అవమానించిందన్నాడు నటుడు జాయెద్‌ ఖాన్‌. అంతేకాక తనపై చెప్పులు విసిరిందని చెప్పాడు. మరి దర్శకురాలికి అంత కోపం వచ్చేలా జాయెద్‌ ఏం చేశాడు? తను ఎందుకంత వైల్డ్‌గా ప్రవర్తించిందో అతడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'మై హూనా(2004) సినిమా షూటింగ్‌ జరుగుతున్న రోజులవి. అప్పుడు ఇంకా టెక్నాలజీ అంత అభివృద్ధి చెందలేదు. నచ్చినన్ని టేకులు తీసుకునేందుకు ఆస్కారం లేదు. సెట్‌లో అందరూ క్రమశిక్షణతో మెదులుకోవాల్సిందే! ఒక సీన్‌లో కెమెరా.. అమృతరావును క్యాప్చర్‌ చేసి ఆ తర్వాత నావైపుకు వస్తోంది.

నా చుట్టూ ఉన్నవారంతా కూడా రెడీగా ఉండండి అని అరుస్తున్నారు. అప్పటికే డ్యాన్సర్లంతా వేసిన స్టెప్పులే మళ్లీ వేసి రెడీగా నిల్చున్నారు. సరిగ్గా కెమెరా నా వైపుకు రాగానే నా వెనకాల ఉన్న డ్యాన్సర్‌ ఒకరు ఫిట్స్‌తో కింద పడిపోయారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ నేను డ్యాన్స్‌ చేస్తూ ఉన్నాను. అతడలా పడిపోతే నేను పట్టించుకోకుండా డ్యాన్స్‌ చేయడం నచ్చలేదు. కట్‌ అన్నాను. అంతే ఫరాకు పట్టరానంత కోపం వచ్చింది. నానామాటలు అంది. ఆవేశంతో నా మీదకు తన చెప్పులు విసిరింది. తన ప్రవర్థన అర్థం కాక.. ఓవైపు మనిషి చావుబతుకుల్లో ఉంటే నన్ను డ్యాన్స్‌ చేయమని ఎలా అడుగుతున్నావు? అని తిరిగి ప్రశ్నించాను. దీనికామె నా సెట్‌లో కట్‌ చెప్పడానికి నువ్వెవరు? చెప్తే నేను మాత్రమే చెప్పాలి అని అరిచింది.

అప్పటికి అక్కడున్నవాళ్లకు పరిస్థితి అర్థమై వెంటనే ఆ పడిపోయిన వ్యక్తిని కాపాడారు. ఆ తర్వాత డ్యాన్స్‌ యథావిధిగా కొనసాగింది' అని చెప్పుకొచ్చాడు జాయెద్‌. కాగా 2004లో వచ్చిన మై హూనా సినిమాలో షారుక్‌ ఖాన్‌, సుష్మితా సేన్‌, సునీల్‌ శెట్టి, అమృత రావు, జాయెద్‌ ఖాన్‌​ ముఖ్య పాత్రల్లో నటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సెయింట్‌ పాల్‌ స్కూల్‌లో ఈ షూటింగ్‌ జరిగింది. ఇకపోతే జాయెద్‌ ఖాన్‌ 2003లో 'చౌరా లియా హై తుమ్నే' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మై హూనా, శబ్ధ్‌, దస్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు చివరగా హాసిల్‌ షోలో కనిపించాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అతడు 'దట్‌ నెవర్‌ వాస్‌' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. మోహిత్‌ శ్రీవాత్సవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది: డ్యాన్స్‌ మాస్టర్‌ బంధువు

కానిస్టేబుల్‌ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్‌ఖుష్‌ అయిన డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement