Megastar Chiranjeevi: చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు యోధా లైఫ్ డ‌యాగ్న‌స్టిక్స్ భారీ విరాళం

Yoda Lifeline Diagnostics Sudhakar Promise Give 50 Percent Discount For MAA Members - Sakshi

ద‌శాబ్ధాలుగా మెగాస్టార్ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ నిరంత‌ర సేవాకార్య‌క్ర‌మాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ్ల‌డ్ బ్యాంక్ .. ఐ బ్యాంక్ సేవ‌లతో ఎంద‌రో అవ‌స‌రార్థుల‌ను ఆదుకుంది ఈ ట్ర‌స్ట్. క‌రోనా క్రైసిస్ క‌ష్ట కాలంలో ఆక్సిజ‌న్ సేవ‌ల్ని ప్రారంభించి ఎంద‌రో ప్రాణాల్ని కాపాడిన సంగ‌తి తెలిసిన‌దే. చేసిన సేవ‌ల‌కు గుర్తింపు గౌర‌వం ద‌క్కుతోంది. బుధవారం అమీర్‌పేటలో యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా యోధా లైఫ్ డ‌యాగ్న‌స్టిక్స్ అధినేత సుధాక‌ర్ రూ. 25 లక్షల విరాళం చిరంజీవి ట్ర‌స్ట్ సేవ‌ల కోసం అందించారు. 

చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా

ఈ సంద‌ర్భంగా చిరంజీవి వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చిరు మాట్లాడుతూ.. ‘ఇది ఊహించ‌లేదు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా సొంత రిసోర్సెస్‌తోనే ట్ర‌స్ట్‌ను న‌డిపాను. ఈ మ‌ధ్య కాలంలో కొంతమంది పెద్ద‌లు ముందుకు వచ్చి చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ సేవ‌ల్ని గుర్తించి సముచిత ఆర్థిక సాయాన్ని అందివ్వడం ఆనందదాయకం.  మీరు ఇచ్చిన   ప్ర‌తి ఒక్క పైసా అవసరార్ధులకు  అందేలా చేస్తా, ఇది మీకు నా హామీ.  ఇదే స‌మ‌యంలో నా వ్య‌క్తిగ‌త‌ అభ్య‌ర్థ‌న‌. మా సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) లోని పేద క‌ళాకారులు, జూనియర్ కళాకారులు 24 క్రాష్ట్‌లోని చిన్న టెక్నీషియన్స్  ఉన్నారు. వారంతా స‌రైన వైద్యం అంద‌క‌ ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. మీ డ‌యాగ్న‌సిస్ సెంట‌ర్  ద్వారా రోగ నిర్ధారణ పరిష్కారానికి గాను వారికి సాయం చేస్తార‌ని ఆశిస్తున్నాను’ అని అన్నారు. 

చదవండి: నయన్‌కు సామ్‌ బర్త్‌డే విషెస్‌, లేడీ సూపర్‌స్టార్‌పై ఆసక్తికరంగా పోస్ట్‌

దానికి ప్ర‌తిస్పంద‌న‌గా.. మూవీ ఆర్టిస్టుల సంఘంతో స‌హా 24 శాఖ‌ల కార్మికుల‌కు 50 శాతం త‌క్కువ ఖ‌ర్చులోనే ఆరోగ్య‌ సేవ‌లందిస్తామ‌ని యోధ లైఫ్ లైన్ సుధాక‌ర్ అన్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ ట్విట్ట‌ర్లోనూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇలాంటివి స‌మాజానికి మంచి సంజ్ఞ‌ల్ని ఇస్తాయి. ఎక్కువ మందికి సేవ చేయడం .. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో మాకు సహాయపడతాయి. హైదరాబాద్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధ లైఫ్ లైన్ డ‌యాగ్న‌స్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల గారికి హృదయపూర్వక అభినందనలు... అని మెగాస్టార్ చిరంజీవి  అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top