
చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వంభర’ నుంచి మరో టీజర్ విడుదల కానుంది. ఈమేరకు షోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది... కానీ కుదర్లేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది. అయితే, ఈ మూవీకి సంబంధించి విడుదలై మొదటి టీజర్ గ్రాఫిక్స్ వర్క్‌పై విమర్శలు వచ్చాయి. ఆ సమయం నుంచి పెద్దగా అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు.

విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై విమర్శలు రావడంతో దర్శకుడు వశిష్ఠి పలు జాగ్రత్తలు తీసుకున్నారట. మరింత సమయం తీసుకున్నా సరే సినిమా హిట్ కావాలనే సంకల్పంతో పనిచేశాడట. ఈ క్రమంలోనే ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు వస్తుండటంతో అభిమానులు విశ్వంభర నుంచి ఏదైనా గిఫ్ట్ వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టీజర్‌ను సిద్ధం చేసింది చిత్ర బృందం. ఆపై విడుదల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు అనిల్ రావిపూడి కూడా చిరు పుట్టినరోజుకు కానుక ఇవ్వాలని చూస్తున్నారట. సినిమా టైటిల్ ప్రకటించాలని ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
విశ్వంభర అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.