
తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనగానే ముంబై నుంచి లేదంటే కేరళ కుట్టీలు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కర్ణాటక నుంచి ఈమె తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. మొన్నటికి మొన్న నాగార్జునతో మూవీ చేసింది. ఇప్పుడు చిరంజీవితో చేస్తోంది. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఆమెనే ఆషికా రంగనాథ్. కర్ణాటకలోని తుమకూరులో పుట్టింది. బెంగళూరులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే 2014 టైంలోనే మిస్ ఫ్రెష్ ఫేస్ అనే అందాల పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. కానీ మహేశ్ బాబు అనే దర్శకుడి దృష్టిలో పడి, అతడు తీసిన 'క్రేజీ బాయ్' సినిమాతో హీరోయిన్‌గా మారింది.
2016 నుంచి సినిమాలు చేస్తున్న ఆషిక.. కన్నడ స్టార్ హీరోలైన శివరాజ్ కుమార్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ చిత్రాల్లో నటించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోకి కల్యాణ్ రామ్ 'అమిగోస్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఫెయిలైంది కానీ నటిగా ఈమెకు మంచి మార్క్స్ పడ్డాయి. నాగార్జునతో చేసిన 'నా సామి రంగ' కూడా ఈమెలో గ్లామర్, యాక్టర్‌ని అందరికీ పరిచయం చేసింది.
(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్ షాహిర్)
'నా సామి రంగ'లో ఆషికని చూసిన 'విశ్వంభర' టీమ్.. తమ చిత్రంలో కీలక పాత్ర కోసం అవకాశమిచ్చింది. చిరు చేస్తున్న 'విశ్వంభర'లో ఆషికా.. అతిలోక సుందరి తరహా పాత్ర చేస్తోంది. కొన్నిరోజుల క్రితమే ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగానూ ప్రకటించింది. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే గనక ఆషికకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ.
ఇకపోతే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన చిన్నప్పుడు జెండా పట్టుకుని దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు.. చిన్నప్పుడు ఆషిక ఇలా ఉందా? ఇప్పుడు మాత్రం చాలా అందంగా ఉందే అని మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగత జీవితానికొస్తే.. కొన్ని నెలల క్రితం ఈమె అక్క అనుష పెళ్లి చేసుకుంది. మరి ఆషిక ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: విజయ్‌తో రొమాంటిక్ స్టిల్.. ‘చాలా స్పెషల్’ అంటూ రష్మిక పోస్ట్)