స్టార్‌ సింగర్‌ అక్రమ సంబంధాలు: అడిగితే మందు బాటిల్‌తో | Yo Yo Honey Singh Domestic Violence Case: Wife Shalini Shocking Allegations | Sakshi
Sakshi News home page

Honey Singh: హనీసింగ్‌ అలాంటివాడు, రూ.10 కోట్లు ఇప్పించండి

Published Thu, Aug 5 2021 12:49 PM | Last Updated on Sun, Oct 17 2021 1:59 PM

Yo Yo Honey Singh Domestic Violence Case: Wife Shalini Shocking Allegations - Sakshi

Yo Yo Honey Singh Domestic Violence Case: స్టార్‌ సింగర్‌ యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్‌ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం ఆమె పిటిషన్‌ సైతం దాఖలు చేసింది. 120 పేజీలున్న ఈ పిటిషన్‌లో హనీసింగ్‌ ఆగడాల గురించి షాలిని వివరించింది. అతడి యాటిట్యూడ్‌ వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించాననేది పేర్కొంది.

'2011లో హనీమూన్‌ అయిపోయిన తర్వాత హర్దేశ్‌ సింగ్‌(హనీ సింగ్‌ అసలు పేరు) సడన్‌గా మారిపోయాడు. ఏమైంది? ఎందుకిలా మారిపోయావని ప్రశ్నిస్తే.. తనకు ఇష్టం లేకపోయినా కేవలం నాకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. హనీమూన్‌ ట్రిప్‌లో నన్ను ఒంటరిగా వదిలేసి తాగుబోతులా తిరిగేవాడు. ఈ ప్రవర్తన గురించి అడిగితే నా జుట్టు పట్టుకుని కొట్టి, నోరు మూసుకోమని చెప్పేవాడు. అతడికి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది, అందుకే నన్ను తనవెంట టూర్లకు తీసుకెళ్లేవాడు కాదు. మా పెళ్లి విషయాన్ని ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచాలనుకునేవాడు. అందుకే వేలికి రింగ్‌ కూడా పెట్టుకునేవాడు కాదు. కానీ ఇంటర్నెట్‌లో మా ఫొటోలు లీక్‌ అవడంతో దానికి నేనే కారణమంటూ నన్ను దారుణంగా కొట్టాడు. అవి ఓ సినిమా షూటింగ్‌ స్టిల్స్‌ అని కవర్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

'బ్రౌన్‌ ర్యాంగ్‌' పాట కోసం వర్క్‌ చేసిన ఒక మహిళతోనూ హనీ సింగ్‌కు అఫైర్‌ ఉంది. ఈమేరకు ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అభ్యంతరకర ఫొటోలు నా కంటపడ్డాయి. వాటి గురించి నిలదీస్తే నా మీదకు మందు బాటిళ్లు విసిరాడు. ఆ తర్వాత వేరే ఆడవాళ్లతో కలిసి దిగిన ఫొటోలు చాలానే కనబడ్డాయి. నా పట్ల నా భర్త అతి క్రూరంగా ప్రవర్తించాడు. ఇదిలా వుంటే ఒకరోజు నేను బట్టలు మార్చుకుంటుంటే మామయ్య నేరుగా నా గదిలోకి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ ఇంట్లో నన్ను హింసించారని నిరూపించేందుకు నా దగ్గర ఇంకా ఎన్నో సాక్ష్యాలున్నాయి' అని షాలిని తెలిపింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం కింద హనీ సింగ్‌ నుంచి రూ.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేసింది. దీనిపై ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాలంటూ హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement